బాన్సువాడ, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా కాసుల బాలరాజ్ మాట్లాడారు.
నెహ్రూ సూచన మేరకు హైదరాబాద్ సంస్థానాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసేందుకు కృషి చేశారని ఆయన అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది ఆత్మబలి దానాలు చేసుకున్నారని, అమరవీరుల త్యాగాలను గుర్తించిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన వారి ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతి ఒక్కరు కలిసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాలెక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుడాల నగేష్, రేంజర్ల సాయిలు, గొల్ల వెంకన్న యాదవ్, కొట్టం గంగాధర్, మన్నన్, సోహెబ్, దాసరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.