కామారెడ్డి, సెప్టెంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులలో బీఎల్వోలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో ఆదివారం బూత్‌లెవల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ జాబితాలో ఉన్న ప్రతి పేరును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
మృతి చెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని తెలిపారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు సేకరించాలన్నారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, సిపిఓ రాజారాం, ఎన్నికల సూపరిండెంట్ అనిల్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.