కామారెడ్డి, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లా ప్రజలకు, ఉద్యోగులకు సుఖశాంతులను అందించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి బి. సాయిలు, టిజివో అధ్యక్షుడు దేవేందర్, కార్యదర్శి సాయి రెడ్డి ప్రతినిధులు దేవరాజు, శ్రీనివాస్ రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.