బీర్కూర్, సెప్టెంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలం దుర్కి పీర్ల చెరువులో ప్రభుత్వ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం రేపు అనగా బుధవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహింప బడుతున్నట్లు ఎంపిపి విఠల్ తెలిపారు.
ఈ కార్య్రమానికి ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రాష్ట్ర మత్స్యశాఖ ఫెడరేషన్ వైస్ చైర్మన్ దిటి మల్లయ్య , జిల్లా మత్స్యశాఖ అధికారి వర్ధ రెడ్డి తదితర జిల్లా అధికారులు విచ్చేస్తున్నారని కార్యకర్తలు,అధికారులు,నాయకులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.