చెక్కులు పంపిణీ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం శాసనసభ్యులు జాజాల సురేందర్‌ ఎల్లారెడ్డి (17), లింగం పేట్‌ (06), నాగిరెడ్డి పేట్‌ (07) మరియు గాంధారి (03) మండలాలకు చెందిన 33 మంది కళ్యాణ లక్ష్మి – షాది ముభారక్‌ లబ్దిదారులకు రూ.33,03,828 విలువ గల చెక్కులను మరియు ఎమ్మెల్యే స్వంత ఖర్చులతో ప్రతి లబ్దిదారురాలికి పట్టు చీరను పంపిణీ చేశారు.

అనంతరం ఎల్లారెడ్డి, నాగిరెడ్డి పేట్‌, గాంధారి, లింగంపేట్‌ మండలాలకు చెందిన రూ.26,77,500 విలువ గల (60) సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. అదేవిధంగా గాంధారి మండలం పోతంగల్‌ గ్రామానికి చెందిన కె.శోభ కి రూ.2,50,000 మరియు లింగంపేట్‌ మండలం మోతే గ్రామానికి చెందిన జి.శివారెడ్డి కి రూ.2,00,000 విలువ గల సీఎంఆర్‌ఎఫ్‌ – ఎల్వోసి పంపిణీ చేశారు.

లింగం పేట్‌ మండలం బానాపూర్‌ గ్రామానికి చెందిన మొంబాజి పేట్‌ నరేష్‌, నల్లమడుగు గ్రామానికి చెందిన కొండా రాజులు, మరియు గాంధారి మండలం గుర్జాల్‌ గ్రామానికి చెందిన సిరిగిరి అనంతయ్య ఇటీవల ప్రమాద వశాత్తూ విద్యుత్‌ షాక్‌ కు గురై మరణించగా వారి కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి రూ.5,00,000 చొప్పున రూ.15,00,000 విలువ గల (03) చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

భారీ వర్షాల కారణంగా ఇటీవల నాగిరెడ్డిపేట్‌ మండలం బొల్లారం గ్రామానికి చెందిన ఎరుగడిరడ్ల రాజు మరియు గాంధారి మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన పిట్ల రవి మరణించిన కారణంగా బాధితుల ఒక్కో కుటుంబానికి రూ.4,00,000 చొప్పున మొత్తం రూ.8,00,000 విలువ గల (02) ఉత్తర్వులను గౌరవ ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

అదేవిధంగా, గాంధారి మండలం గుర్జాల్‌ గ్రామానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సొప్పరి హన్మంతు ఇటీవల మరణించిన కారణంగా బాధితుని కుటుంబానికి రూ.2,20,000 ఎక్స్‌గ్రేషియా ఉత్తర్వులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి దేశానికి మార్గదర్శకంగా ఉందని, ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో సంపద సృషించబడి సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంపిణీ చేయబడుతుందని అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌, నియోజకవ్గ మండలాల ప్రజాప్రతినిధులు, ఏఎంసి చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, సీనియర్‌ నాయకులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »