కామారెడ్డి, సెప్టెంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఆగస్టు 2023 నెలకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. కార్డుదారులకు సూక్ష్మ పోషకాలను అందించే ఉద్దేశంతో పొరిటిఫైడ్ బియ్యం అనగా పోషకాలతో కూడిన బలవర్ధకమైన బియ్యమని అర్థం. పొరిటిఫైడ్ బియ్యంలో మూడు అత్యంత ఆవశ్యక సూక్ష్మ పోషకాలైన ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ -12 లు నిర్ధారిత మోతాదులలో కలపబడి ఉంటాయని చెప్పారు.
ఈ బియ్యం నాణ్యత ప్రమాణితమైన విధానాలలో పరీక్షించబడి ఆమోదించబడి ఉంటుందని తెలిపారు. ఇవి అనేమియా, సూక్ష్మ పోషక తత్వాలనుంచి ప్రజల్ని కాపాడతాయని చెప్పారు. ఐరన్ ఎనీమియా (రక్తహీనత) నుంచి రక్షణ లభిస్తుంది. శరీరంలో అలసట తగ్గిస్తోంది. నెలలు నిండకుండా ప్రసవం అవ్వడం, బరువు తక్కువగా పుట్టడం వంటి ప్రసవ సంబంధిత సమస్యలు తలెత్తవు.
ఫోలిక్ ఆసిడ్ : శరీరంలో తగినంత రక్తము తయారు కావడానికి సహాయపడుతుంది. గర్భస్థ దశలో నరాల బలహీనత వలన పుట్టే బిడ్డలలో పుట్టుకతో వచ్చే రుగ్మతల నుంచి రక్షణ కల్పిస్తుంది.
విటమిన్ బి-12 : మెదడు, నాడీ వ్యవస్థను సక్రమంగా పనిచేయడంలో సహకరిస్తుంది. శరీరంలో రక్తం తయారు కావడానికి సహకరిస్తుంది. ఈ బియ్యమును బియ్యం పిండి, విటమిన్, ఖనిజాల మిశ్రమంతో తయారు చేస్తారు. జిల్లాలోని అందరికార్డుదారులకు తెలియజేయునది. ఏమనగా పొరిటిఫైడ్ బియ్యంలో వేరుగా కనిపించే గింజలు ప్లాస్టిక్ తో చేసిన బియ్యం కాదు. ఈ బియ్యంలో అవసరమైన సూక్ష్మ పోషకాలు ప్రభుత్వం చే నిర్ధారితమైన మోతాదులో కల్పబడినట్లు తెలిపారు.
ఈ బియ్యం ను నీళ్లలో వేసిన ఎడల పైకి తేలుతాయి. ఇట్టి తేలిన బియ్యాన్ని పడేయకుండా బియ్యంతో పాటు కలిపి వండుకొని తినవలెనని సూచించారు.
ముఖ్య గమనిక : తల సేమియా వ్యాధి ఉన్నవారు ఇట్టి పొరిటిఫైడ్ బియ్యంను తినకూడదు. జిల్లాలోని అందరూ రేషన్ కార్డు దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పొరిటిఫైడ్‌తో కూడిన రేషన్ బియ్యం ను తిని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు.