Transparent umbrella under heavy rain against water drops splash background. Rainy weather concept.

మళ్ళీ వాన…

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉంది. ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది భారత వాతావరణం శాఖ.

వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు కోస్తాలో రాయలసీమలో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని ఐఎండీ ప్రకటించింది. రాయలసీమలోనూ చెదురుమదురు వర్షాలు కురుస్తాయి.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »