ఆర్మూర్, సెప్టెంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్ వాడి టీచర్లు వారి సమస్యల సాధన కోసం చేస్తున్న సమ్మెకు ప్రగతి శీల ప్రజసామ్యా విద్యార్థి సంఘం పిడిఎస్‌యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏరియా అద్యక్షులు ఎల్.అనిల్ కుమార్ మాట్లాడుతు… గత కొన్ని రోజులుగా అంగన్వాడి టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే పాలకులు, ప్రభుత్వం, వారి గోడు వినే పరిస్థితి లేదని, తెలంగాణలోని ఆడ బిడ్డలు నా బిడ్డెలు అన్న ముఖ్యమంత్రికి ఈ తల్లుల వేదన కనబడటం లేదా అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ తల్లులు, ఉద్యమాలు చేస్తే, తెలంగాణ వచ్చిన తరువాత కూడా వీరి బతుకు కోసం ఉద్యమం చేస్తున్నారు అంటే ఇదేనా బంగారు తెలంగాణ, నీ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం తక్షణమే అంగన్వాడి టీచర్లతో చర్చలు జరపాలని, వారిని రెగ్యులర్ చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వారికి కూడా రిటైర్డ్మెంట్ బెన్ఫిట్ అందేలా చూడాలన్నారు.
వారికి 26 వేల కనీస వేతనం ఇవ్వాలని, తదితర అంశాలపై దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏరియా నాయకులు సాయి కృష్ణ, రంజాన్, దయ, తదితరులు పాల్గొన్నారు.