Daily Archives: September 20, 2023

గృహలక్ష్మి అమలును వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి సకాలంలో లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా గృహలక్ష్మి, ఆసరా పెన్షన్ల దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, అర్హులైన వారి జాబితాలు పంపించాలని అన్నారు. రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, ఎరువులు-విత్తనాల నిల్వలు, తెలంగాణకు హరితహారం, …

Read More »

అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలని వినాయకుడికి వినతి

భిక్కనూరు, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం, దక్షిణ ప్రాంగణం యూనివర్సిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను బే షరతుగా రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ 16వ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయంలో వినాయక స్వామి పూజ చేసి కాంట్రాక్ట్‌ అధ్యాపకులు తమ సమస్యను విన్నవించుకున్నారు. వీరితోపాటు వివిధ డిపార్ట్మెంట్ల విద్యార్థులు సైతం పూజలు చేసి తమ ఉపాధ్యాయులు రెగ్యులరైజ్‌ …

Read More »

టియు డిగ్రీ ఫలితాల విడుదల

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బిఏ, బీకాం, బీఎస్సీ రెండవ మరియు నాలుగవ సెమిస్టర్‌ ఫలితాలను తెలంగాణ విశ్వవిద్యాల రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి బుధవారం విడుదల చేశారు. రెండవ సెమిస్టర్‌లో బాలురు 3696 మంది కాగా బాలికలు 5289 మందితో కలిపి 8985 మంది హాజరయ్యారన్నారు. ఇందులో 11.96 శాతంతో 442 మంది బాలురు, 36 శాతంతో 1904 …

Read More »

రిజిస్ట్రార్‌ ఆకస్మిక తనిఖీ

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ కళాశాలలో బుధవారం ఉదయం రిజిస్ట్రార్‌ ఆచార్య యం. యాదగిరి పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలలో బోధనా తీరును పరిశీలించారు. అనంతరం మాస్‌ కమ్యూనికేషన్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌ని, ఆర్గానిక్‌, ఫార్మసిటికల్‌ కెమిస్ట్రీ ల్యాబ్‌లను, బోటనీ మరియు బయోటెక్నాలజీ ల్యాబ్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ …

Read More »

అక్టోబర్‌ 4న తుది జాబితా

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 28 వరకు వచ్చే అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు అక్టోబర్‌ 4 న ఫైనల్‌ పబ్లికేషన్‌ ఆఫ్‌ ఎలక్టోరోల్‌ ను ప్రచురించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. …

Read More »

ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదే

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అలవికాని వాగ్దానాల జోలికి వెళ్లకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేసి చూపిన ఘనత కెసిఆర్‌ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసన సభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలంలోని పడగల్‌ గ్రామంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రెండు …

Read More »

అనీమియాతో బాధపడుతున్న మహిళకు రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన మంజుల (42) పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో చికిత్సకు కావలసిన ఓ పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో సదాశివనగర్‌ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన సామల సంతోష్‌ రెడ్డికి తెలియజేయడంతో వెంటనే సకాలంలో స్పందించి రక్తాన్ని కేబిఎస్‌ రక్తనిధి కేంద్రంలో 21 వ సారి …

Read More »

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో జిల్లా అధికారుల భేటీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథితో నిజామాబాద్‌ జిల్లా ఉన్నతాధికారులు బుధవారం భేటీ అయ్యారు. పొరుగునే ఉన్న నిర్మల్‌ జిల్లా బాసరలో గల ట్రిపుల్‌ ఐ.టీలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్రేరణ కల్పించే కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ బుధవారం బయలుదేరి వెళ్తూ, మార్గమధ్యంలో గల నిజామాబాద్‌ రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహంలో కొద్దిసేపు బస చేశారు. ఈ సందర్భంగా …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, సెప్టెంబరు 20, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి ఉదయం 10.39 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 12.43 వరకుయోగం : విష్కంభం రాత్రి 1.43 వరకుకరణం : బాలువ ఉదయం 10.39 వరకు తదుపరి కౌలువ రాత్రి 10.23 వరకు వర్జ్యం : సాయంత్రం 4.43 – 6.20దుర్ముహూర్తము : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »