కామారెడ్డి, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన మంజుల (42) పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో చికిత్సకు కావలసిన ఓ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో సదాశివనగర్ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన సామల సంతోష్ రెడ్డికి తెలియజేయడంతో వెంటనే సకాలంలో స్పందించి రక్తాన్ని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో 21 వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు కావడం జరుగుతుందని ప్లేట్ లెట్స్ అందజేయడానికి దాతలు ముందుకు రావాలన్నారు. రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరపున అభినందనలు తెలిపారు.