డిచ్‌పల్లి, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో బుధవారం ఉదయం రిజిస్ట్రార్ ఆచార్య యం. యాదగిరి పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలలో బోధనా తీరును పరిశీలించారు.
అనంతరం మాస్ కమ్యూనికేషన్ కంప్యూటర్ ల్యాబ్‌ని, ఆర్గానిక్, ఫార్మసిటికల్ కెమిస్ట్రీ ల్యాబ్‌లను, బోటనీ మరియు బయోటెక్నాలజీ ల్యాబ్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ ప్రతి ఒక్క ల్యాబ్ ఉన్న పరికరాలు, కెమికల్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా చూడాలని అధ్యాపకులకు సూచించారు.
అలాగే ప్రతి క్లాస్ రూమును శుభ్రంగా ఉంచాలని క్లాస్ రూమ్లలో ఫ్యాన్లు ట్యాబ్లెట్లను ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. తనిఖీలో రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరితో ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. సత్యనారాయణ, డా. నాగరాజు, డా. బాలకిషన్, డా. జావీరియా ఉజమా, డా. కిరణ్మయీ మరియు డా. పున్నయ్య డైరెక్టర్ ఆఫ్ (పిఆర్వో) కేర్ టేకర్ సుధీర్ కుమార్ తదితరులు ఉన్నారు.