కామారెడ్డి, సెప్టెంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లత (28) గర్భిణీ స్త్రీకి శిశువు గర్భంలో మృతి చెందడంతో అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం కావలసి ఉండగా వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
చిన్న మల్లారెడ్డి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి సహకారంతో కేబిఎస్ రక్త నిధి కేంద్రంలో రక్తాన్ని అందజేశారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తదానం చేయడం అంటే ప్రాణదానంతో సమానమని అన్నారు. రక్తం సకాలంలో దొరకకపోవడం వల్ల చాలామంది ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని ప్రస్తుతం డెంగ్యూ వ్యాధితో కామారెడ్డి జిల్లాలో మృతి చెందడం జరిగిందని స్వచ్ఛందంగా రక్తదానం, ప్లేట్ లెట్స్ అందజేయాలనుకున్న వారు వారి వివరాలను 9492874006 నెంబర్‌కి తెలియజేయాలని అన్నారు.
రక్తదాతకు టూరిజం పూర్వ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టెక్నీషియన్లు వెంకట్, జీవన్, సంపత్ పాల్గొన్నారు.