డిచ్పల్లి, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా డిచ్పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెగా ఆరోగ్యమేల నిర్వహించారు. మేళాను ముఖ్యఅతిథిగా విచ్చేసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను సామాజిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని డిచ్పల్లి మరియు ఇందల్వాయి మండలాలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడాఈ శిబిరంలో పాల్గొని ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా డిచ్పల్లి మరియు ఇందల్వాయి మండలాల ప్రజా ప్రతినిధులు ప్రజలందరూ పాల్గొనేలా చూడాలని కోరారు.
ముఖ్యంగా ప్రత్యేక వైద్య నిపుణులైన డాక్టర్ సందీప్ పిల్లల వైద్య నిపుణులు, డాక్టర్ సృజన్ జనరల్ మెడిసిన్, డాక్టర్ పవన్ జనరల్ సర్జన్, డాక్టర్ రేఖ శ్రీ వైద్య నిపుణులు, డాక్టర్ ప్రమోద్ కుమార్ చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు, డాక్టర్ ఉమామహేశ్వరి కంటి వైద్య నిపుణురాలు, డాక్టర్ రవితేజ మానసిక వైద్య నిపుణులు, డాక్టర్ రాఘవేందర్ ఆర్థో వైద్య నిపుణులు, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ సుశాంత్, డాక్టర్ సంతోష్ క్యాంప్ ఆఫీసర్ పాల్గొని వివిధ వ్యాధి గ్రస్తులకు రోగ నిర్ధారణ చేసి చికిత్స అందించారు.
చికిత్స శిబిరంలో మొత్తం సుమారు 349 మంది వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించారు. కార్యక్రమంలో డిపిఓ విశాల, జిల్లా ఆరోగ్య విద్య బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, హెచ్‌ఇఓ వైశంకర్, ప్రకాష్ గోపి మరియు మండలంలోని వివిధ ఆరోగ్య ఉప కేంద్రాల నుండి ఎమ్మెల్యే హెచ్‌పీలు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.