కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైనదని, ఓటరుగా నమోదయిన ప్రతి ఒక్కరు నైతిక బాధ్యతగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి ప్రభుత్వం డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో ఓటు హక్కు పై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ప్రతి ఓటు కీలకమైనదని, ఒక్క ఓటు గెలుపు ఓటములు నిర్ణయించే …
Read More »Daily Archives: September 23, 2023
ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకం
నిజామాబాద్, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ సూచించారు. సమీప భవిష్యత్తులో జరుగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం ఎన్నికల సెక్టోరల్ అధికారులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఎన్నికల …
Read More »వినాయక మండపాలకు ఎమ్మెల్యే విరాళం
రెంజల్, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలో కొలువైన 27 వినాయక మండపాలకు ఎమ్మెల్యే షకీల్ ఒక్కొక్క మండపానికి 50 కిలోల బియ్యాన్ని అన్నదానం కొరకు అందజేసినట్లు సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో కొలువుదీరిన వినాయక మండపాలకు అన్నదానం కొరకు ఎమ్మెల్యే షకీల్ సహకారంతో ఒక్కొక్క మండపానికి 50 కిలోల చొప్పున …
Read More »సైబర్ వలలో ఉపాధ్యాయుడు
బాన్సువాడ, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని బుడ్మీ గ్రామానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు చిలుక సాయిలుకు ఈనెల ఆరో తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది. అతని యొక్క క్రెడిట్ కార్డుకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోలు లింకు చేస్తానని చెప్పి క్రెడిట్ కార్డు యొక్క పరిధి పెంచుతానని చెప్పడంతో ఉపాధ్యాయుడు తనకు వచ్చిన ఓటీపిలను సైతం వాట్సాప్ …
Read More »అంగన్‌వాడి ఉద్యోగుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు
బీర్కూర్, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం బీర్కూరు మండల కేంద్రంలో బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంగన్‌వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెకు సంఫీుభావం తెలిపారు. రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, డాక్టర్ అనిల్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, దామరంచ ఛైర్మన్ కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న …
Read More »ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
బాన్సువాడ, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోస్ర మండల కేంద్రంలో అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం 13వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నన్నేసాబ్, కరుణా దేవి మాట్లాడుతూ అంగన్ వాడీ ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే ప్రత్యామ్నాయ మార్గం చూస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటని, ఆమె మాటలను వెనక్కి తీసుకొని ఉద్యోగులకు …
Read More »27న మెగా జాబ్‌మేళా
బాన్సువాడ, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ నెల 27న బాన్సువాడ పట్టణ శివారులోని ఎస్‌ఎంబి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పిబిఆర్ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని బారాస పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి …
Read More »ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
రెంజల్, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామాలయం అభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని నూతన రామాలయ చైర్మన్ పెద్దోళ్ల సుధాకర్ రావ్ అన్నారు. శనివారం మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో రామాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల కమిటీ సభ్యులచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ తో …
Read More »తక్షణమే వివరాలు అందజేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత శాసనసభ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలు, మద్యం అమ్మకాల వివరాలు ప్రస్తుతం ఆరు మాసాలలో జరిగిన బ్యాంకు లావాదేవీలు, మద్యం అమ్మకాల వివరాలు రేపటిలోగా అందజేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన …
Read More »25న ఉద్యోగ మేళా
నిజామాబాద్, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ / యువకులు ప్రైవేట్ రంగంలో ఉద్యోగములు కలిపించేందుకు ఈనెల 25వ తేదీ సోమవారం ఉదయం 10.30 నుండి 2.30 గంటల వరకు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం నందు ఉద్యోగ మేళ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనా అధికారి సిరిమల్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ క్రెడిట్ …
Read More »