అంగన్‌వాడి ఉద్యోగుల సమ్మెకు కాంగ్రెస్‌ మద్దతు

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బీర్కూరు మండల కేంద్రంలో బాన్సువాడ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అంగన్‌వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెకు సంఫీుభావం తెలిపారు. రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, డాక్టర్‌ అనిల్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌ గౌడ్‌, దామరంచ ఛైర్మన్‌ కమలాకర్‌ రెడ్డి మాట్లాడుతూ గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటన్నారు.

బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వారిని పలకరించకపోవడం ఇంకా సిగ్గుచేటని, వారి డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చా లన్నారు. లేనియెడల రాబోవు రెండు నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం రాబోతున్నదని, వారి డిమాండ్లను కాంగ్రెస్‌ పార్టీ నెరవేరుస్తుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఏక్బాల్‌, డిసిసి డెలిగేట్‌ గంగా ప్రసాద్‌, అమృత్‌, హన్మగొండ, అనిల్‌, గంగప్ప, బోయుడి లక్ష్మన్‌, గజ్జల సాయిలు, పీర్యా నాయక్‌, ఇమ్రాన్‌, శ్రీనివాస్‌, సాయిలు, యాధు, హన్మంతు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »