బాన్సువాడ, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ నెల 27న బాన్సువాడ పట్టణ శివారులోని ఎస్‌ఎంబి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పిబిఆర్ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని బారాస పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ అన్నారు.
శనివారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరుద్యోగ యువత కోసం ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని అలాగే ప్రస్తుతం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం 60కి పైగా ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో ఈనెల 27న ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు మెగా జాబ్ మేళాకు హాజరై ఉద్యోగాలు పొందాలన్నారు.
అభ్యర్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పదవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదివిన నిరుద్యోగ యువత 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు ఎజాస్, గురు వినయ్, నరసన్న చారి, విట్టల్ రెడ్డి, అమీర్ చావుస్, కిరణ్, కౌన్సిలర్ వెంకటేష్, మోతిలాల్, అజీమ్, వాహబ్, హకీమ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.