బాన్సువాడ, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని బుడ్మీ గ్రామానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు చిలుక సాయిలుకు ఈనెల ఆరో తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది.
అతని యొక్క క్రెడిట్ కార్డుకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోలు లింకు చేస్తానని చెప్పి క్రెడిట్ కార్డు యొక్క పరిధి పెంచుతానని చెప్పడంతో ఉపాధ్యాయుడు తనకు వచ్చిన ఓటీపిలను సైతం వాట్సాప్ చేశాడు. అతని ఖాతా నుండి డబ్బులు పోయినట్లు మెసేజ్ రావడంతో వెంటనే 1930 సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. కాగా శనివారం బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.