రెంజల్, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామాలయం అభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని నూతన రామాలయ చైర్మన్ పెద్దోళ్ల సుధాకర్ రావ్ అన్నారు. శనివారం మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో రామాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల కమిటీ సభ్యులచేత ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ తో పాటు సభ్యులను గ్రామస్తులు ఘనంగా షాలువ, పూలమాలతో సత్కరించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ రావ్ మాట్లాడుతూ. తనపై నమ్మకంతో రామాలయ కమిటీ చైర్మన్గా ఎంపిక చేసిన ఎమ్మెల్యే షకీల్కు ఎంపికకు కృషి చేసిన గ్రామ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే షకీల్ సహకారంతో రామాలయాన్ని మరింత అభివృద్ధి చేసి చూపుతామని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాజు, సాయిలు, ధర్మన్న, హన్మవ్వ, గ్రామ పెద్దలు మౌలానా, హన్మంత్ రావ్, గంగాధర్ బాబా, లింగారెడ్డి, అబ్బన్న, మల్ల సాయిలు, ప్రతాప్ రెడ్డి, పి.రాజేశ్వర్, అనంత్ రావ్, మధు, రవి, హరిగౌడ్, అన్వర్ తదితరులు ఉన్నారు.