కామారెడ్డి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం నిరుపేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వడంతో సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. గృహ లక్ష్మీ పథకం కింద లబ్ధిదారులు గృహాలను నిర్మించుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకొని ఆదర్శ కాలనీగా మార్చుకోవాలని సూచించారు. కామారెడ్డి పట్టణంతో పాటు, బీబీపేట, జనగామ, మాందాపూర్ గ్రామాల పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి, దోమకొండ ఎంపీపీలు ఆంజనేయులు, బాలమణి, తహసిల్దార్ లత, అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.