కామారెడ్డి, సెప్టెంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని కామారెడ్డి లో గల గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్, హిస్టరీ, బోటని బోధించేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నపూర్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 30 లోపు దరఖాస్తులను సమర్పించాలని కోరారు. పిజీలో 55 శాతం, నెట్ లేదా సెట్ పాస్ కావాలని తెలిపారు. పీ హెచ్ డీ వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. వివరాల కోసం 8500400635 కు సంప్రదించగలరు అని వారు తెలిపారు.