కామారెడ్డి, సెప్టెంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్.చోంగ్తు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ మను చౌదరి లతో కలిసి పెద్దకొడపగల్ మండలం జగన్నాధ్పల్లి లోని 163 వ పోలింగ్ కేంద్రాన్ని, ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌లోని 229 పోలింగ్ కేంద్రాలను సందర్శించి రిజిస్టర్లను, ఓటరు జాబితాలను పరిశీలించారు.
రెండవ విడత ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, మార్పులు, చేర్పులను కోరుతూ ఓటర్ల నుండి సేకరించిన నిర్ణీత నమూనా ఫారాలను, రిజిస్టర్లలో వాటిని నమోదు చేసిన వివరాల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా బీ.ఎల్.ఓలు, సూపర్వైజర్లకు ఓటరు నమోదు, మార్పులు-చేర్పులు తొలగింపులకు సంబంధించి అనుసరిస్తున్న పద్దతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
18 – 19 సంవత్సరాల వయస్సు కలిగిన కొత్త ఓటర్ల నుండి వచ్చిన ఆఫ్ లైన్, ఆన్ లైన్ ద్వారా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, నూతనంగా పెళ్ళై వెళ్లిపోయిన పెళ్ళై గ్రామానికి వచ్చిన యువతుల ఓటు షిఫ్టింగ్ ఎలా చేస్తున్నారు, మరణ ధ్రువపత్రం పొందిన తరువాతే పేరు తొలగింపు చేస్తున్నారా, నోటీసులు ఇచ్చారా, డూప్లికేట్ ఓటర్లను తెలిగించారా, 80 పై బడిన ఓటర్లు ఎందరున్నారు, ఫై.డబ్ల్యూడీ ఓటరు మార్కింగ్ చేస్తున్నారా, ఇంటింటి సర్వే సందర్భంగా గమనించిన అంశాలేమిటీ అని వివరాలు ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నెల 19 వరకు వచ్చిన ధరఖాస్తులన్నింటిని రేపటిలోగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన అందరికి ఓటు హక్కు కల్పించాలని, సూచించారు. నూతనంగా ఓటరుగా నమోదు చేసుకున్న మధ్య వయస్కుల వారికి గతంలో ఎక్కడ ఓటు హక్కు ఉందొ తెలుసుకొని షిఫ్టింగ్ లేదా అక్కడ ఓటరు జాబితాలో పేరు తొలగించిన తరువాతే నూతన ఓటరుగా నమోదు చేయాలని,. బోగస్ ఓటర్లకు ఆస్కారం లేకుండా పక్కాగా తుది జాబితా రూపొందేలా చూడాలన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ఓటర్ల నమోదు, మార్పులు,చేర్పులపై గ్రామా గ్రామాన విస్తృత ప్రచారంతో పాటు ఇంటింటి సర్వే ద్వారా అనూహ్య స్పందన లభించింనదని జులై 17 నుండి సెప్టెంబర్ 19 వరకు ఫారం-6,7,8 లకు సంబంధించి 35,528 దరఖాస్తులు రాగా వెంటవెంటనే క్షేత్ర బీస్థాయిలో పరిశీలించి పరిష్కరించమని, మిగిలిన 10 వేల దరఖాస్తులను రేపటిలోగా పరిష్కరిస్తామని పరిశెలకురాలుకు తెలిపారు. తుది ఓటరు జాబితాలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్.డి.ఓ. భుజంగం, తహసీల్ధార్లు, సర్పంచులు, గ్రామా కార్యదర్శులు తదితరులు ఉన్నారు.