ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బిసి కాలనీ యువకులు బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిసి కాలనీ యువకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే జాజాల సురేందర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ పార్టీ కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని సూచించారు. పార్టీ అన్ని విధాల వారికి అండగా ఉంటుందని బరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మునిసిపల్ చైర్మన్ సత్యనారాయణ, ఇమ్రాన్, టౌన్ అధ్యక్షుడు సతీష్, మండల అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, కౌన్సిలర్లు, రాజు, రాములు, బిసి కాలనీ యువకులు పాషా, అంబు, శివ, గౌస్, సందీప్, ఇర్ఫాన్, మోసిన్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.