కామారెడ్డి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితాలో తప్పొప్పులు సరిచేసి అర్హులైన ఓటర్లను నమోదు చేసి మరింత మెరుగ్గా, పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించదానికే నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు తీసుకోవడానికే గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ రాజకీయ పార్టల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పనపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటరుకు సర్వోన్నత స్థానముందని, అర్హుడైన ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు కావడంతో పాటు, సరైన విచారణ జరపకుండా ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తొలగించరాదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చిందని అన్నారు.
అందులో భాగంగా చేపట్టిన సెకండ్ సమ్మరి రివిజన్ చేపట్టడం జరిగిందని, జులై 16 నుండి ఈ నెల 19 వరకు నూతన ఓటరు నమోదు, సవరణల కొరకు ఫారం -6,7,8 ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, జుల్ 16 నుండి ఈ నెల 19 వరకు వచ్చిన 49,424 క్లెయిమ్స్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు. అన్ని క్లైమ్స్ ను నేటి వరకు పరిష్కరించడంతో పాటు చిరునామా మార్పు, మరణించిన వారి ఓట్ల తొలగింపు, రెండు ఆ పై ఉన్న ఎపిక్ కార్డులు కలిగిన వారి వివరాల తొలగింపు, ఒకే కుటుంబానికి చెందిన వారు అందరు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా తుది జాబితా రూపొందించి ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని అక్టోబర్ 4 న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని, అట్టి జాబితానే ఎన్నికల నిర్వహణకు ప్రామాణికమని అన్నారు.
జిల్లాలో 1,47,780 నాన్ స్టాండర్డ్ ఎపిక్ కార్డుల స్థానంలో నూతనంగా వచ్చిన స్టాండర్డ్ ఎపిక కార్డుల ఇంటిమేషన్ లేఖలను బి.ఎల్.ఓ ల ద్వారా సంబంధితులకు చేరవేశామని చంద్ర మోహన్ తెలిపారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఈ.వి.ఏం. వివిప్యాట్‌ల ద్వారా డమ్మీ ఓట్లు వేయించి ఓటు వేసే విధానంపై అవగాహన కలిగించారు. ఇంవరకు 6,544 మంది కేంద్రాన్ని సందర్శించి మాక్ పోలింగ్ చేశారన్నారు.
అదేవిధంగా సంచార వాహనాల ద్వారా జిల్లాలోని మూడు నియోజక వర్గాలలోని 348 పోలింగ్ బూతులు కవర్ చేసి మాక్ పోలింగ్ పై అవగాహన కలిగించామన్నారు. ఓటరు జాబితా రూపకల్పన లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాల నివృత్తి కోసం నేడు కామారెడ్డి తహశీల్ధార్ కార్యాలయంలో బి.ఎల్.ఓ.లు, సూపర్వైజర్లతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం సి.పిఓ. ఆద్వర్యంలో ఏర్పాటైన మ్యాన్ పవర్ కమిటీలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఆపరేటర్ గా విధములు నిర్వహిస్తున్న తీరును పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు.
సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు జూకంటి ప్రభాకర్, మదన్ లాల్ జాదవ్, కాసిం అలీ, బట్టేనికి బాలరాజు, మహమ్మద్ జఫ్ఫార్ ఖాన్, అనిల్ కుమార్, సిపిఒ రాజారామ్, ఎలక్షన్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.