కామారెడ్డి, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత గణేష్ మండలి గణపతి లడ్డు కు బుధవారం వేలంపాట నిర్వహించారు.రూ.5000 నుంచి 13 మంది వ్యక్తులు లడ్డూను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. చివరకు టీఎన్జీవోస్ కార్యదర్శి బి. సాయిలు వేలంపాడి రూ.29116 లడ్డును దక్కించుకున్నారు. సాయిలును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు.
జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. 266 మంది కలెక్టరేట్ ఉద్యోగులు గణపతికి నగదు రూపంలో విరాళాలు ఇచ్చారు. వారిలో 15 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఐదు గ్రాముల వెండి నాణేలను అందజేశారు. గణపతి విగ్రదాత డాక్టర్ దేవేందర్ ను సన్మానించారు.
కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి బి. సాయిలు, టీజీవో జిల్లా అధ్యక్షుడు దేవేందర్, ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, టీఎన్జీవోస్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్, ప్రతినిధులు రాజ్యలక్ష్మి, ఉమలత, లక్ష్మీ నరసవ్వ, స్వప్న పాల్గొన్నారు.