మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది

నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమైన పవిత్రమైన రోజు మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా కోట్ల రూపాయలు పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమని, ముందుగా ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు.

నియోజవర్గవ్యాప్తంగా మైనార్టీలకు వంద శాతం సబ్సిడీతో మంజూరైన రూ.లక్ష ఆర్థికసాయం చెక్కులను భారతి గార్డెన్‌లో బుధవారం అందజేసి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా ఆత్మగౌరవంతో బతికేవిధంగా సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తూ జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.

మైనార్టీ గురుకుల పాఠశాలల ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిషు మీడియం విద్యను అందిస్తున్నామని, ఒకప్పుడు ఇళ్లకే పరిమితమైన ముస్లిం ఆడపిల్లలు ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారని అన్నారు. మైనార్టీల విదేశీ విద్య కోసం ప్రభుత్వం చేయూతనందిస్తుందన్నారు. ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అనే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారిజీవన విధానంలో గణనీ యమైన మార్పులను తీసుకువచ్చిందన్నారు.

మసీదులు, షాదీఖానాలు, ఖబరస్థాన్ల నిర్మాణానికి బడ్జెట్‌లో కోట్లాది రూపాయలను మంజూరు చేస్తున్నామన్నారు. నిజాంబాద్‌ రూరల్‌ నియోజకవర్గం లో నేడు ఈరోజు నాలుగు కోట్ల రూపాయలు విలువగల ప్రోసిడిరగ్‌ ఆర్డర్స్‌ పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. మసీదుల్లో మౌజమ్లకు, ఇమామ్లకు గౌరవేతనం ఇస్తున్నామన్నారు. రంజాన దుస్తులు పంపిణీ చేయడంతో పాటు ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేస్తూ గౌరవంగా చూస్తున్నామన్నారు. ‘మైనార్టీ బంధు’ పథకం ద్వారా ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందజేస్తూ అండగా నిలిచిందన్నారు.

కార్యక్రమంలో జిల్లా యువ నాయకులు జిల్లా ఒలంపిక్‌ ఉపాధ్యక్షులు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్‌, ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారి మోహన్‌, అన్ని మండలాలకు చెందిన జడ్పిటిసిలు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మండల అధ్యక్షులు ముఖ్యంగా అన్ని మండలాల మైనార్టీ నాయకులు, బిఆర్‌ఎస్‌ పార్టీ మైనార్టీ కోఆప్షన్‌ మెంబర్స్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, మైనార్టీ మహిళలు, మైనార్టీ యువజన విభాగాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »