బాన్సువాడ, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండల కేంద్రంలో ఆరోగ్యశాఖ ఆశా వరకర్ల సమ్మెకు పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి కాంగ్రెస్ నాయకులతో వారి డిమాండ్లకు సంపూర్ణ మద్ధతునిచ్చారు.
డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి మాట్లాడుతూ గత 4 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని, బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వారిని పలకరించకపోవడం ఇంకా సిగ్గుచేటన్నారు. వారి డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని, లేనియెడల రాబోవు రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది వారి డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని అన్నారు.
కరోనా సమయంలో వీరు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేశారని కెసిఆర్ దీన్ని మర్చిపోయి వీరిని రోడ్డు పాలు చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షలు గంగప్రసాద్, రాష్ట్ర యువజన నాయకులు బానోత్ రమేష్ అడ్వోకెట్, మండల ఉపాధ్యక్షులు రెడ్డి రాంబాబు, సుద్దులం మాజీ సర్పంచ్ పీర్యా నాయక్, సొసైటీ డైరెక్టర్ గంగప్ప, మండల యూత్ ఉపాధ్యక్షులు ఇమ్రాన్, సీఐటీయూ జిల్లా నాయకులు నన్నే సబ్, నాయకులు బషీర్ తదితరులు పాల్గొన్నారు.