నిజామాబాద్ ,సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ములుగు జిల్లాకు వెళ్లిన సందర్భంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు స్థానిక ఏఐటీయూసీ నాయకుడైన మధ్యాహ్న భోజన కార్మిక వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌ని ములుగు జిల్లా మధ్యన భోజన కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని నిజామాబాద్ జిల్లా ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తుందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య, యూనియన్ జిల్లా కార్యదర్శి చక్రపాణిలు అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులు పేద విద్యార్థులకు వండి కడుపునిండా భోజనం పెట్టి వందశాతం ప్రభుత్వ పాఠశాలలకు హాజరు శాతాన్ని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల నాలుగు నెలల బకాయి బిల్లులు చెల్లించకుండా, 22 నెలల క్రితం అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన పెంచిన వేతనాలు అమలు చేయకుండా చేస్తున్న నిజాయితీగా పేద విద్యార్థుల కోసం పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు హరీష్ రావుని కలవడానికి తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళుతున్న సందర్భంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో తరలించడం దుర్మార్గమన్నారు.
వారికి చిత్తశుద్ధి ఉంటే కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపాలని బకాయి బిల్లులు, బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన నాయకుల్ని విడుదల చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆందోళన చేస్తుందని హెచ్చరించారు.