కామారెడ్డి, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెంపుడు జంతువులు రాబిస్ వ్యాధిని పడకుండా తప్పకుండ ర్యాబిస్ టీకాలు వేయించవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. లూయిస్ పాశ్చర్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28 న ప్రపంచ రాబిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు జిల్లా పశు వైద్య అధికారి సింహ రావు తో కలిసి రేబిస్ వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.
రేబిస్ అనే ఒక భయంకరమైన వైరస్ వల్లే వచ్చే వ్యాధిని అన్నారు. కుక్కలు, పిల్లి, ఎలుక వంటి పెంపుడు జంతువులు కరవడం, చొంగ కార్చడం వాళ్ళ ఇతర జంతువులకు, మనుషులకు రాబిస్ వ్యాధి వచ్చే అవకామేశముందని అన్నారు. రాబిస్ వచ్చినట్లు అనుమానం వచ్చిన వెంటనే పెంపుడు జంతువులకు రాబిస్ టీకాలు వేయించాలన్నారుప్రతి సంవత్సరం సమీపంలోని పశు వైద్యశాలలలో పెంపుడు జంతువులకు రేబిస్ టీకాలు వేయించాలని సూచించారు.
పెంపుడు కుక్కలను బయటకు తీసుకెళ్లేటప్పుడు తప్పసరిగా దాని మెడకు బెల్టు ధరించాలని సూచించారు. పెంపుడు కుక్క కరిచినా వెంటనే యాంటీ వైరస్ టీకా వేయించుకోవడంతో పాటు సబ్బుతో కడిగి 15 నిముషాలు పాటు ధారాళంగా వచ్చే నీటి కుళాయి క్రింద ఉంచాలన్నారు. ఆరు బయట సంచరించే జంతువులను ముట్టుకోరాదని, వాటిని రెచ్చగొట్టరాదని హితవు పలికారు.అలాగే చికెన్, మాంసం వ్యర్థ పదార్థాలు వీధులలో పడేయరాదని సూచించారు. పెంపుడు జంతువులను ఆరుబయటకు వదలరాదని, కుక్క కరిస్తే వ్యాధి లక్షణాలు బయట పడే వరకు వేచి చూడకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు.