కామారెడ్డి, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిగ్రీ పట్టా అందజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ అరుణ మాట్లాడుతూ ఆర్కే కళాశాల విద్యార్థులు ఉత్తమంగా చదివి భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు.
అట్లాగే ఆర్కే కళాశాలలో నాణ్యమైన విద్యతోపాటు అన్ని రంగాల్లో ముందుండేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని, అన్ని రకాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తదనంతరం హైయ్యర్ ఎడ్యుకేషన్‌తో పాటు ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని వారు తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డే లో పలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని డిగ్రీ పట్టాను తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు డిగ్రీ పట్టాను తీసుకోవడంలో ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించారని తెలిపారు.
విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత రంగాలలో స్థిరపడాలని కళాశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరుని తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం డిగ్రీ పట్టా తీసుకున్న విద్యార్థులు పలువురిని అభినందించారు. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ గౌన్, క్యాప్ ధరింపజేసి గోల్డ్ మెడల్‌ని మరియు సర్టిఫికెట్‌లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అరుణ సీఈవో తెలంగాణ యూనివర్సిటీ, కళాశాల కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి, చైర్మన్ భాస్కర రావు, కళాశాల ప్రిన్సిపల్ సైదయ్య, దత్తాత్రి, నవీన్ కుమార్, గోవర్ధన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.