కామారెడ్డి, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కామారెడ్డి రక్తదాతల సమూహం ఏర్పాటుచేసి 15 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్, సమన్వయకర్త డాక్టర్ బాలు, అధ్యక్షులు డాక్టర్ పి.వేద ప్రకాష్, ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్ తెలిపారు.
రక్తదాన శిబిరానికి రక్తదాతలు పెద్ద సంఖ్యలో విచ్చేసి రక్తదానం చేసి గత 15 సంవత్సరాలుగా రక్తదానం చేస్తున్న రక్తదాతలను, ఆత్మీయ సన్మాన గ్రహీతలను అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 15 సంవత్సరాల కాలంలో వేలాది మందికి సకాలంలో రక్తాన్ని డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి కావలసిన ప్లేట్ లేట్స్‌ను, కరోనా సమయంలో ప్లాస్మాను, వందలాది రక్తదాన శిబిరాలను, రక్తదానం పైన అవగాహనను తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను నిర్వహించి సమాజ హితమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి విచ్చేసి రక్తదాతలను ఆత్మీయ సన్మాన గ్రహీతలను అభినందించాల్సిందిగా కోరారు.
కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులు జమీల్ కిరణ్, అనిల్, రమణ, ఎర్రం చంద్రశేఖర్, శ్రీకాంత్ రెడ్డి, చింతల లక్ష్మీపతి తెలిపారు.