Monthly Archives: September 2023

ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో వినాయక చతుర్థి, మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి గణేష్‌ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ …

Read More »

బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని అన్ని గ్రామాల్లో బిజెపి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి బిజెపి కార్యకర్తపై ఉందని పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల శేఖర్‌ అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త ఇప్పటినుండే బూత్‌ స్థాయిలో ఉన్న …

Read More »

రెడ్‌ క్రాస్‌ పురస్కారానికి బుక్క రజని

కామరెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ కామారెడ్డి జిల్లా అశోక్‌ నగర్‌ కాలనీకి చెందిన సదాశివనగర్‌ మండలం మల్లుపేట్‌ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న బుక్క రజని రెడ్‌ క్రాస్‌ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, డీఈవో రాజు చేతుల మీదుగా అందజేస్తారు. …

Read More »

17న జాతీయ సమైక్యతా దినోత్సవం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సమైక్యత దినోత్సవం కార్యక్రమం విజయవంతానికి అధికారులు సమన్వయంతో పనిచేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. గురువారం కలెక్టరేట్‌ లోని సమావేశమందిరంలో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌, ఆర్‌.డి.ఓ. శ్రీనివాస్‌ రెడ్డి లతో కలిసి జాతీయ సమైక్యత, ఓటరు నమోదు, వైద్య కళాశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …

Read More »

యూనివర్సిటీలో హిందీ భాష దినోత్సవం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాలలో హిందీ డిపార్ట్మెంట్‌ ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్‌ అబ్దుల్‌ ఖవి చైర్మన్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ ఉర్దూ హాజరయ్యారై మాట్లాడారు. హిందీ భాష గొప్పదని, స్వతంత్ర పోరాటంలో హిందీ భాషా ముఖ్య భూమిక పోషించిందని పేర్కొన్నారు. ప్రముఖ హిందీ రచయితలు ప్రేమ్‌ …

Read More »

చంద్రబాబు నాయుడి క్షేమం కొరకు ప్రత్యేక పూజలు

నందిపేట్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జైలు నుండి క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ తెలంగాణ రాష్టం లోని నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఉన్న ఆంధ్ర మెస్త్రిలు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి రాష్టానికి రెండు సార్లు ప్రత్యేక ఆంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జాతీయ స్థాయి నాయకుడిపై కక్ష …

Read More »

15న టెట్‌.. ఏర్పాట్లు పూర్తి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15 న రెండు సెషన్స్‌లో జరగబోయే రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (టీచర్స్‌ ఎలిజిబుల్‌ టెస్ట్‌- (టెట్‌) కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో టెట్‌ పరీక్ష నిర్వహణ కోసం నియమించిన 360 మంది చీఫ్‌ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్‌ అధికారులు, హాల్‌ …

Read More »

సిడిపిఓ కార్యాలయాన్ని ముట్టడిరచిన అంగన్వాడి ఉద్యోగులు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి అంగన్వాడి ఉద్యోగులు పూలమాలలు వేసి ర్యాలీగా సిడిపిఓ ఆఫీస్‌ ముట్టడి చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్‌ మాట్లాడుతూ ఐసిడిఎస్‌ వ్యవస్థ 45 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న టీచర్లకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, కనీస వేతనాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, సెప్టెంబర్‌ 11 …

Read More »

అంగన్వాడిల సమ్మెకు మద్దతు తెలిపిన షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో అంగన్‌వాడిలు నిర్వహిస్తున్న సమ్మెకు మాజీమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు షబ్బీర్‌ అలీ గురువారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైందని, వారికి కావలసిన ఉద్యోగ భద్రత కల్పించడం, ప్రమాద బీమా వర్తింప చేయడం వారి న్యాయమైన డిమాండ్లు అని అన్నారు. ప్రభుత్వం వెంటనే అంగన్‌వాడిలు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను …

Read More »

ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సన్మానం

జక్రాన్‌పల్లి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జక్కం కార్తీక్‌ను జక్రాన్‌ పల్లి ముదిరాజ్‌ నాయకులు గురువారం సన్మానించారు. ఈసందర్భంగా జక్రాన్‌పల్లి గ్రామంలో ముదిరాజుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి చోప్పరి శంకర్‌ తెలంగాణ ముదిరాజుల అధ్యక్షులు చేతుల మీదుగా నూతనంగా ఎన్నుకోబడ్డ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్‌ మహాసభ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జక్కం కార్తీక్‌ను సన్మానించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »