బాన్సువాడ, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ బస్టాండులో 12 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ నుంచి బిచ్కుంద కి వెళ్తున్న ప్రయాణికురాలు గోదావరి బ్యాగులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నగలను అపహరించుకు వెళ్లారు. బాన్సువాడ ప్రయాణ ప్రాంగణంలో బిచ్కుంద బస్సు ఎక్కుతుండగా కిక్కిరిసిన జనాల మధ్యలోంచి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్టాండ్లో …
Read More »Monthly Archives: September 2023
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా కాసర్ల
నిజామాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో అందించే ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు నిజామాబాద్‌కు చెందిన తెలుగు పండితులు డా.కాసర్ల నరేశ్ రావు ఎంపికైనారు. ఉపాధ్యాయ దినోత్సవమైన 5 సెప్టెంబరు రోజున డాక్టర్ కాసర్ల ఈ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకో నున్నారు. కాగా కాసర్ల నరేశ్ రావు గుండారం ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారు.
Read More »సామాన్యులకు గుడ్ న్యూస్..
హైదరాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెరిగిన కూరగాయల ధరలతో అల్లాడిపోతున్న బడుగు జీవులకు ఇది ఒక గుడ్ న్యూస్. ఇటీవల భారీగా పెరిగి భయపెట్టిన టమాటాతోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా దిగొస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల టమాటా ధరలు చాలా ప్రాంతాల్లో గరిష్ఠంగా రూ.200 వరకు చేరుకున్నాయి. దాదాపు రెండుమూడు నెలలపాటు అదే ధర కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం …
Read More »దంపతుల ఆత్మహత్య యత్నం
కామారెడ్డి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని రాఘవ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జంగంపల్లి గ్రామానికి చెందిన వార్డ్ సభ్యుడు శివరాజు కత్తితో ఆత్మహత్యకు పాల్పడగా అతని భార్య జ్యోతి ఒంటిపై పెట్రోలు పోసుకోని ఆత్మహత్యయత్నానికి పాల్పడిరది. కంపెనీ సెక్యూరిటీ మరియు పోలీస్ సిబ్బంది అడ్డుకొని జ్యోతిని అంబులెన్స్‌లో కామారెడ్డి జిల్లా …
Read More »మెగా డీఎస్సీ ప్రకటించాలి
బాన్సువాడ, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మెగా డీఎస్సీ కోసం ఎన్‌ఎస్‌యుఐ ఒకరోజు నిరసన దీక్షలో భాగంగా శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు భాను ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం మెగా డీఎస్సీని తక్షణమే ప్రకటించాలని ప్రమోషన్ల ఖాళీలను మెగా డీఎస్సీలో చూపించాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రవేటుకు దీటుగా బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. …
Read More »ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్ ఆకస్మిక తనిఖీ
ఆర్మూర్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో శనివారం పోస్ట్ మాస్టర్ జనరల్ తెలంగాణ కే. ప్రకాష్ ఆకస్మికంగా సందర్శించి పర్యవేక్షించారు. ఈ తనిఖీలో పోస్ట్ ఆఫీస్ డెలివరీ ఫర్ ఫార్మెన్స్, నగదు బదిలీ, కొత్త పథకాలు, ఇన్సూరెన్స్, పోస్టాఫీసులోని వివిధ పథకాల అమలు తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నూతన ఖాతాల ఓపెనింగ్‌లో తెలంగాణ సర్కిల్‌ను ప్రథమ …
Read More »9న లోక్ అదాలత్
కామారెడ్డి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కోర్టు సముదాయ భవనంలో శనివారం చట్టాలపై అవగాహనా కార్యక్రమం మరియు లోక్ ఆదాలత్ నిర్వహణపై సన్నాహక సమావేశాన్ని డైరెక్టర్ ఆఫ్ ప్రాసెక్యూషన్ ఆదేశాల మేరకు మొదటి శనివారం కామారెడ్డి జిల్లా కోర్టు భవన సముదాయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులకు విద్యుత్ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈనెల 9న నిర్వహించే …
Read More »అక్టోబర్ 4న తుది జాబితా
కామారెడ్డి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా బూత్ స్థాయి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలోని 106,107, తాడ్వాయిలోని 108,109 లింగంపేటలోని వివిధ పోలింగ్ బూతులను ఆకస్మికంగా సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. బి.ఎల్.ఓ. …
Read More »ఇంటింటికి తిరుగుతూ వంద శాతం ఓటరు నమోదు జరిపించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా బూత్ లెవెల్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది చొరవ చూపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. వారం రోజుల పాటు ప్రతి నివాస ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ, ఓటరు జాబితాలో పేర్లు లేని వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని అన్నారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, …
Read More »బహిరంగ వేలం
కామారెడ్డి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిట్లం వ్యవసాయ మార్కెట్ యార్డు నందు నూతనంగా నిర్మించిన 20 దుకాణ సముదాయాలను అద్దె ప్రాతిపదికన ఆన్‌లైన్ ద్వారా బహిరంగ వేలం నిర్వహించనున్నామని జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందులో ఎస్సిలకు 3, ఎస్టీకి ఒకటి, బి.సికి 5, పిహెచ్‌సికి ఒక దుకాణం, జనరల్ క్యాటగిరి క్రింద …
Read More »