Monthly Archives: September 2023

పట్టాలు పొందిన లబ్దిదారుల వివరాలు సేకరించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు పట్టాలు పొందిన లబ్ధిదారుల సమగ్ర వివరాలను మండల స్థాయి అధికారులు సేకరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం మండల స్థాయి అధికారులతో గిరి వికాసం పథకం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఇద్దరు నుంచి అయిదుగురు వరకు ఈ పథకంలో …

Read More »

తానా సమ్మేళనానికి కల్పన దేవసానికి ప్రత్యేక ఆహ్వానం…

బాన్సువాడ, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 24న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నారీ సాహిత్య బేరి,అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనానికి కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి కల్పన దేవసాని ప్రత్యేక అతిధిగా తాన సంస్థ ఆహ్వానించినట్లు వారు తెలిపారు. బాన్సువాడ మండలంలోని బోర్లం గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ అనేక …

Read More »

ఎన్నికల నిర్వహణకు కార్యాలయాలను పరిశీలించిన కలెక్టర్‌, సీ.పీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ గురువారం బాల్కొండ, ఆర్మూర్‌ శాసనసభ నియోజకవర్గ కేంద్రాలలో ఎన్నికల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి భీంగల్‌ పట్టణంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల సామాగ్రిని భద్రపర్చే స్ట్రాంగ్‌ రూమ్‌, డిస్ట్రిబ్యూషన్‌ …

Read More »

ఉద్యమాలకు ఊపిరి పోసిన మహనీయుడు…

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిది అని ఆయన వర్ధంతి సందర్బంగా వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పద్మశాలి సంక్షేమ సేవ సమితి అధ్యక్షులు మ్యాక మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ 1969 తొలి దశ పోరాటంలో కీలక పాత్ర పోషించి మంత్రి పదవిని కూడా త్యజించిన మహానీయుడని అన్నారు. …

Read More »

గంజాయిపై ఉక్కుపాదం

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి వేముల ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు గంజాయి సరఫరాపై గట్టి నిఘా పెంచారు. అందులో భాగంగా కమ్మర్‌పల్లి, ముప్కాల్‌, మెండోర పి.ఎస్‌ పరిధిలో ఆర్మూర్‌ ఎసిపి జగదీష్‌ చందర్‌, భీంగల్‌ సిఐ వేంకటేశ్వర్లు, ఆర్మూర్‌ రూరల్‌ సి.ఐ గోవర్దన్‌ రెడ్డి ఆయా పి.ఎస్‌ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, సెప్టెంబరు 21, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి ఉదయం 10.08 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : అనూరాధ మధ్యాహ్నం 12.49 వరకుయోగం : ప్రీతి రాత్రి 11.58 వరకుకరణం : తైతుల ఉదయం 10.08 వరకు తదుపరి గరజి రాత్రి 9.37 వరకు వర్జ్యం : సాయంత్రం 6.19 – 7.55దుర్ముహూర్తము : …

Read More »

గృహలక్ష్మి అమలును వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి సకాలంలో లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా గృహలక్ష్మి, ఆసరా పెన్షన్ల దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, అర్హులైన వారి జాబితాలు పంపించాలని అన్నారు. రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, ఎరువులు-విత్తనాల నిల్వలు, తెలంగాణకు హరితహారం, …

Read More »

అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలని వినాయకుడికి వినతి

భిక్కనూరు, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం, దక్షిణ ప్రాంగణం యూనివర్సిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను బే షరతుగా రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ 16వ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయంలో వినాయక స్వామి పూజ చేసి కాంట్రాక్ట్‌ అధ్యాపకులు తమ సమస్యను విన్నవించుకున్నారు. వీరితోపాటు వివిధ డిపార్ట్మెంట్ల విద్యార్థులు సైతం పూజలు చేసి తమ ఉపాధ్యాయులు రెగ్యులరైజ్‌ …

Read More »

టియు డిగ్రీ ఫలితాల విడుదల

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బిఏ, బీకాం, బీఎస్సీ రెండవ మరియు నాలుగవ సెమిస్టర్‌ ఫలితాలను తెలంగాణ విశ్వవిద్యాల రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి బుధవారం విడుదల చేశారు. రెండవ సెమిస్టర్‌లో బాలురు 3696 మంది కాగా బాలికలు 5289 మందితో కలిపి 8985 మంది హాజరయ్యారన్నారు. ఇందులో 11.96 శాతంతో 442 మంది బాలురు, 36 శాతంతో 1904 …

Read More »

రిజిస్ట్రార్‌ ఆకస్మిక తనిఖీ

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ కళాశాలలో బుధవారం ఉదయం రిజిస్ట్రార్‌ ఆచార్య యం. యాదగిరి పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలలో బోధనా తీరును పరిశీలించారు. అనంతరం మాస్‌ కమ్యూనికేషన్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌ని, ఆర్గానిక్‌, ఫార్మసిటికల్‌ కెమిస్ట్రీ ల్యాబ్‌లను, బోటనీ మరియు బయోటెక్నాలజీ ల్యాబ్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »