కామారెడ్డి, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యతని, పరిశుభ్రతా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భారత ప్రధాని పిలుపుమేరకు స్వచ్ఛత హి సేవా కార్యక్రమం లో భాగంగా స్థానిక హరిజనవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సఖి వన్ స్టాప్ మరియు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రమదానం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో గడ్డిని, పిచ్చి మొక్కలను ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేస్తున్న పనిని మనసుపెట్టి చేస్తే సమాజం బాగుంటుందని. అన్నారు పరిశుభ్రత అనేది ఇంటి నుండి మొదలు కావాలని, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడేయరాదని, తద్వారా మురుగు కాలువలు చెత్తాచెదారంతో నిండుకుంటాయిన్నారు.
పరిసరాలు బాగుండేలా ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికురాలిని కలెక్టర్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సవిత, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.