నిజామాబాద్, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ 1వ తేదీన ఒక గంట సేపు స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినట్టు జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర శైలి బెల్లాల్ తెలిపారు.
నగరంలోని ఇందిరమ్మ ఇళ్ల కాలనీలో నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు, గిరిజన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు కలిసి సుమారు 100 కిలోల ప్లాస్టిక్‌ను సేకరించారు. ఆ ప్రాంతంలోని ప్రజలకు ప్లాస్టిక్ వలన కలిగే నష్టాలను వివరిస్తూ, ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేరు చేయాలని, తమ పరిసరాలను తామే శుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా సీజనల్ వ్యాధులు, విష జ్వరాల నుంచి విముక్తి పొందాలని అవగాహన కల్పించారు.
అనంతరం విద్యార్థులు, స్థానిక మహిళలు అందరూ కలిసి స్వచ్చ భారత్ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సైదా జైనాబ్, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ వి.జి లక్ష్మీ, సిబ్బంది జలజ, విద్యార్థులు పాల్గొన్నారు.