బాల్కొండ, అక్టోబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యోగ అసోసియేషన్ ఆదేశాల మేరకు జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు సోమవారం బాల్కొండ కే.సి.అర్. ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన 232 మంది విద్యార్థులకు బాల్కొండలోని అమృత ధార సేవా సంస్థ వ్యవస్థాపకులు అన్నపూర్ణ దేవి స్వరూపులైన శ్రీశ్రీశ్రీ హరా చారి నారాయణ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు.
ఇది ఇలా ఉండగా నిజామాబాద్ జిల్లా యోగ అసోసియేషన్స్ అధ్యక్షులు ఐశ్వర్య, కార్యదర్శి సి.హెచ్. గంగాధర్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పోటీలను సబ్ జూనియర్ విభాగంలో 8 సంవత్సరాల నుండి 10,12,14 వరకు జూనియర్స్ విభాగంలో 14సంవత్సరాల నుండి 16,18, బాలబాలికలకు, సీనియర్స్ విభాగంలో 18సంవత్సరాల నుండి 21,25,30,35,45 సంవత్సరాలపై బడిన స్త్రీ పురుషులకు ప్రొఫెషనల్ విభాగంలో అదే మాదిరిగా ఆర్టిస్టిక్ మరియు రిథమిక్ విభాగంలో కూడా పోటీలు నిర్వహించామని గంగాధర్ తెలిపారు.
పోటీలలో ఎంపికైన వారు వచ్చే నెల జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యోగ సంఘం అధ్యక్షులు ఐశ్వర్య, ఉపాధ్యక్షుడు టి.ప్రవీణ్, కోశాధికారి ఏ.కమలావాని, జనరల్ సెక్రెటరీ సి.ఎస్. గంగాధర్, జాయింట్ సెక్రటరీ ఏ.రజిత పోటీలను నిర్వహించారు.