గాంధీ జయంతి సందర్భంగా సిఎం నివాళులు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు వారికి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రానికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన అమూల్యమైన సేవలను, చేసిన త్యాగాలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసం ప్రేరణగా, దేశ ప్రజలకు గాంధీజీ అందించిన ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ, విజయాల స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, అనంతర స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి వున్నవని సీఎం తెలిపారు.

వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధితో, పునరుజ్జీవం చెందిన కులవృత్తులతో బలోపేతమైన గ్రామీణ ఆర్థికాభివృద్ధితో, ఆసరానందుకుంటున్నపేదల, పెద్దల చిరునవ్వులతో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతి రూపాలుగా నిలిచాయని సీఎం అన్నారు.

గాంధీజీ సిద్ధాంతాలను, కార్యాచరణను జీవన విధానంలో భాగం చేసుకుని స్వీయ నియంత్రణ, అనుసరణలతో ముందుకు సాగడమే ఆయనకు మనమనిచ్చే ఘనమైన నివాళి అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

Check Also

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »