ఇందూరు జన గర్జనకు బయలుదేరిన బిజెపి నాయకులు

బాన్సువాడ, అక్టోబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో నిర్వహించే ఇందూరు ప్రజా గర్జన సభకు భారీ సంఖ్యలో బాన్సువాడ పట్టణం, మండలంలోని ఆయా గ్రామాల్లో బిజెపి నాయకులు కార్యకర్తలు బస్సులలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వినేందుకు బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుపడుతున్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి స్వస్తి పలికేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారన్నారు.

పాలమూరు బహిరంగ సభలో గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ప్రకటనతో అధికార పార్టీలో గుబులు మొదలైందని రానున్న ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో కాషాయపు జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నిజామాబాద్‌ తరలి వెళ్లిన వారిలో మాజీ అసెంబ్లీ కన్వీనర్‌ చిదూర సాయిలు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్‌ గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు గుడుగుట్ల శ్రీనివాస్‌, పట్టణ కార్యదర్శి కోణాల గంగారెడ్డి, రాజాసింగ్‌, కూనింటి రాము,చీకట్ల రాజు, తుప్తి ప్రసాద్‌, పాశం భాస్కర్‌ రెడ్డి, అశ్విన్‌, విశాల్‌, బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »