నిజామాబాద్, అక్టోబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ దేవతలు – ఆరాధనా సంస్కృతి అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన విశ్రాంత ఆచార్యులు డా. గంగల్ లక్ష్మీపతి సోమవారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో స్వర్గస్థులైనారు.
వారు ప్రభుత్వ అధ్యాపకులుగా ఉద్యోగ విరమణ చేశారు. గ్రామ దేవతల పట్ల అత్యంత మక్కువతో స్వయంగా ఇందూరు జిల్లాలోని ప్రతీ గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామ దేవతలు, వాటి ఫోటోలు, ఆరాధనా పద్ధతి, అక్కడి ప్రజలు, భక్తులు, విశేషాలు, ఆ దేవత యొక్క మహిమల మీద ఎవ్వరూ చేయలేనంత అధ్యయనం చేసి తరగని సంపద వంటి గ్రామ దేవతా చరిత్రను ఇందూరుకు అందించిన ధన్యజీవి.
మంగళవారం మధ్యాహ్నం వారి స్వగ్రామం జలాల్‌పూర్‌లో బంధుమిత్రులు, వారి విద్యార్థుల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి.