డిచ్‌పల్లి, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అనుబంధ కళాశాలల ఇంగ్లీష్ అధ్యాపకులకు తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో బోధనలో మెలకువలు దృక్పదాలపై ఓరెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో ఇప్లు ఇంగ్లీష్ విభాగాధిపతి ఆచార్య జి సువర్ణ లక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ఇంగ్లీషు భాషలో ఉండే క్లిష్టతను సులభంగా విద్యార్థులకు ఎలా అందించాలో వివరించారు.
లిజనింగ్, స్పీకింగ్, రీడిరగ్, రైటింగ్, నైపుణ్యాలతో పాటు పొనటిక్స్‌ను విద్యార్థులు ఎలా నేర్చుకోవాలో మెలుకువలను అందించారు. ఆధునిక యుగంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ భాష కష్టంగా లేదని సోషల్ మీడియా ప్రభావం వల్ల గ్లోబల్ లాంగ్వేజెస్ లోకల్‌గా మారాయన్నారు. అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్ భాషను విస్తృతంగా నేర్చుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు అధికంగా పొందవచ్చునని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి విభాగాధిపతి డాక్టర్ పి సమత అధ్యక్షత వహించగా డాక్టర్ రమణాచారి, డాక్టర్ జోష్ణ, డాక్టర్ స్వామి అనుబంధ కళాశాల అధ్యాపకులతో పాటు, పరిశోధక విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ఓరియంట్ బ్లాక్ స్వాన్ పబ్లిషర్స్ అధినేత లలిత్ ప్రసాద్ డాక్టర్ కె.వి.రమణాచారి డాక్టర్ పి సమత రచించిన ప్రోవుస్ ఇన్ ఇంగ్లీష్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి అన్ని కాలేజీలకు ఉచితంగా పంపిణీ చేశారు.