నిజామాబాద్, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గిరిరాజ్ ప్రభుత్వ పీజీ రెండవ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.యస్.యు.) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పి.డి.యస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, సెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రారంభం కావాల్సిన తరగతులు ఇప్పటికి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యమని అన్నారు.
విద్యార్థులు తమ చదువులు చదవలేక ఇప్పటికీ వారి సెలబస్, టీచర్లు, ఎవరని తెలియక అయోమయంలో ఉన్నారని తెలిపారు.విద్యా సంవత్సరం నెల రోజులు గడుస్తున్నా విద్యార్థులకు భోధన చేయకపోవడం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
వెంటనే విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తరగతులు ప్రారంభం చేయకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పి.డి.యస్.యు. నాయకులు నాగేష్, మంగ, యశ్వంత్‌లతో విద్యార్థులు పాల్గొన్నారు.