కామారెడ్డి, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిల్లింగ్ లక్ష్యాలను అక్టోబర్ 31 లోగా రైస్ మిల్లుల యజమానులు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం రైస్ మిల్లులో యజమానులతో అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 25 శాతం లక్ష్యం తక్కువ ఉన్న రైస్ మిల్ యజమానులు ధాన్యం మిల్లింగును వేగవంతం చేయాలని సూచించారు. 50 శాతం లక్ష్యం దాటని రైస్ మిల్లులకు వచ్చే ఖరీఫ్ సీజన్ ధాన్యం పంపబోమని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి మల్లికార్జున బాబు, జిల్లా సివిల్ సప్లై జనరల్ మేనేజర్ అభిషేక్ సింగ్, డిప్యూటీ తహసిల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.