కామారెడ్డి, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసే విధంగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ఆయిల్ ఫామ్ లో అంతర్ పంటలు సాగు చేసుకోవచ్చని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుచేసిన రైతు క్షేత్రాన్ని ఇతర రైతులు క్షేత్ర పర్యటన చేసే విధంగా చూడాలన్నారు. ఎకరానికి 50 ఆయిల్ ఫాం మొక్కలు ఉండే విధంగా నాటుకోవాలని చెప్పారు. వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలకు ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని కోరారు.
జిల్లాలో 8, 100 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవనాధికారి విజయ భాస్కర్, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.