ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేరు రిజిస్టర్‌ చేసుకోండి

కామారెడ్డి, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసంఘటిత రంగాలలో పనిచేస్తూ ఈ-శ్రమ్‌ పోర్టల్‌ నందు పేరు రిజిస్టర్‌ చేసుకొని ప్రమాదవశాత్తు చనిపోయిన, అంగవైకల్యం పొందిన కార్మికులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఎక్స్‌-గ్రేషియా అందిస్తున్నదని కార్మిక శాఖ సహాయ కమీషనర్‌ సురేందర్‌ కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన క్రింద మార్చి 31, 2022 నాటికి ఈ-శ్రమ్‌ పోర్టల్‌ నందు పేరు నమోదు చేసుకొని ఆ తేదీలోపు చనిపోయిన కార్మికుల నామినీలకు 2 లక్షలు, అంగవైకల్యం పొందిన కార్మికునికి ఒక లక్ష ఎక్స్‌ గ్రేషియా అందించనుందని అన్నారు. కామారెడ్డి జిల్లాలో కలెక్టర్‌ విశేష కృషివల్ల అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న లక్షా 50 వేల మంది కార్మికులను ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేయించామని అన్నారు.

మార్చి 31, 2022 నాటికి ఈ-శ్రమ్‌ పోర్టల్‌ నందు పేరు నమోదు చేసుకొని ఆ తేదీ లోపు చనిపోయిన లేదా అంగవైకల్యం పొందిన కార్మికుల నామినీలు, కార్మికులు ఎక్స్‌ గ్రేషియా నిమిత్తం కలెక్టరేట్‌లోని సహాయ లేబర్‌ కమీషనర్‌కు ఫిబ్రవరి 23, 2024 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు వెంట మరణ ధ్రువపత్రం, ఆధార్‌, ఈ-శ్రమ్‌ కార్డు, ఎఫ్‌.ఐ.ఆర్‌, పంచనామా, పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌, వైద్య ధ్రువపత్రం, నామిని బ్యాంకు వివరాలు సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ఫారం, ఇతర వివరాలకు కార్యాలయ పనివేళలో తనను సంప్రదించవలసినదిగా ఆయన సూచించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »