నిజామాబాద్, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కోడూరు స్వామిని నియమించినట్టు జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. పద్మశాలి సంఘం నగర కార్యదర్శిగా గతంలో పని చేసిన అనుభవం ఉన్న కోడూరి స్వామి రాకతో జిల్లా బీసీ సంక్షేమ సంఘం బలోపేతం అయిందని నరాల సుధాకర్ అన్నారు.
కోడూరు స్వామి ఎన్నో సామాజిక సేవలు చేసిన అనుభవం ఉన్నవారని, బీసీ కులాల అభివృద్ధి కొరకు అహర్నిశలు పని చేస్తానని కోడూరి స్వామి అన్నారు. జిల్లా బీసీ సంఘంలో కోడూరి స్వామి చేరుతున్నందుకు రాష్ట్ర నాయకులు ఆకుల ప్రసాద్ హర్షం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో ఆకుల ప్రసాద్, నగర అధ్యక్షులు ధర్శనం దేవేందర్, ఎనుగందుల మురళి, కరిపె రవిందర్, నారాయణ రెడ్డి, నారాయణ రావు నాని, లక్ష్మణ్ గౌడ్, శ్రీలత, విజయ్, గురుచరణ్, హనుమంత్ రావు, పోశెట్టి, విష్ణు, సదానంద్, వెంకటేశ్, భీమర్తి రవి, శ్రీనివాస్, శివలింగం, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.