చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసించిన టిఎన్‌ఎస్‌ఎఫ్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడానికి నిరసిస్తూ సంఫీుభావం తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు మాట్లాడుతూ అధికార బలంతో చెయ్యని తప్పులకు అక్రమ కేసులను నమోదు చేసి అక్రమంగా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం జరిగిందని, అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన బాబుపై అధికార బలంతో జగన్‌ ప్రభుత్వం అక్రమ కేసులకు తెరదీసిందని ఈ కేసులను వెంటనే విరమించుకోవాలని లేకపోతే టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

2000 సంవత్సరంలోనే విజన్‌ 2020 పేరుతో సైబరాబాద్‌ను నిర్మించి అభివృద్ధికి బాటలు వేయడం జరిగిందని, ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో నాడు చంద్రబాబు నాయుడు ఆలోచనతోనే సాధ్యమైందని అన్నారు. టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇంజనీరింగ్‌ విద్య యొక్క ప్రాధాన్యత మహిళల అభివృద్ధికి అక్షరాస్యతకు మహిళా సాధికారికకు పెద్దపీట వేసిన వ్యక్తిపై తప్పుడు కేసులు బనాయించడం సిగ్గుచేటని ఇప్పటికైనా జగన్‌ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు అంటే కోట్లాదిమంది ప్రజలకు అభిమానం ఉన్నదని వారికి త్వరలోనే బెయిల్‌ వస్తుందని రానున్న రోజుల్లో టిడిపి అధికారం చేపట్టిన తర్వాత దానికి తగిన బదులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ కరీంనగర్‌ పార్లమెంటు అధ్యక్షులు మోతే రాజిరెడ్డి, జహీరాబాద్‌ పార్లమెంట్‌ ఇంచార్జ్‌ అంజల్‌ రెడ్డి, రాజు, నవీన్‌, సతీష్‌, మైపాల్‌, సందీప్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »