కామారెడ్డి, అక్టోబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సందీప్ (28) డెంగ్యూ వ్యాధితో ప్లేట్ లెట్స్ సంఖ్య పదివేలకు పడిపోవడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్ ప్లేట్ లెట్స్ అవసరం కావడంతో లింగంపేట్ మండలం జల్దిపల్లి గ్రామానికి చెందిన రమేష్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో సకాలంలో ప్లేట్ లెట్స్‌లను అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
జిల్లావ్యాప్తంగా డెంగ్యూ వ్యాధితో వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారని వారికి ప్లేట్ లేట్స్ అవసరం ఉన్నందున మానవతా దృక్పథంతో స్పందించి అందజేయడానికి ముందుకు రావాలన్నారు. సకాలంలో స్పందించిన రమేష్‌కు ఐవిఎఫ్ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరపున అభినందనలు తెలిపారు. రక్తదానం మరియు ప్లేట్ లేట్స్ దానం చేయాలనుకున్నవారు వారి యొక్క వివరాలను 9492874006 నెంబర్‌కి తెలియజేయాలన్నారు.