కామారెడ్డి, అక్టోబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ట్రాన్స్ జెండర్లకు సూచించారు. శుక్రవారం తన ఛాంబర్ లో మహిళా, శిశు, దివ్యంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్ధిక పునరావాసం పధకం క్రింద యషిక, రష్మిక, పెరిసిస్ అనే ముగ్గురు ట్రాన్స్ జెండర్లకు 50 వేల రూపాయల చొప్పున చెక్కులు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ఈ 50 వేల ఆర్ధిక సహాయంతో ఏదేని చక్కటి ఉపాధి కల్పించే వ్యాపారాలను ప్రారంభించుకొని ఆర్ధికంగా ఎదుగుతూ సమాజంలో గౌరవంగా జీవించాలని హితవు చెప్పారు. జిల్లాలో ట్రాన్స్ జెండర్లు ఓటర్లుగా 54 మంది నమోదు చేసుకున్నారని, ఇంకా ఎవరైనా ఉంటే ఓటర్లుగా నమోదు చేసుకునేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఢీ. డబ్ల్యూ. ఓ. బావయ్య తదితరులు పాల్గొన్నారు.