బాన్సువాడ, అక్టోబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాలలో పూర్వం ఉమ్మడి కుటుంబాలతో కుటుంబాలు ఆనందంగా ఉంటూ వ్యవసాయ పనులు చాల చక్కగా చేసుకుంటూ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఆడవారు ఇంటిపనికి వుంటే మిగతా ఆడవారు పొలం పనులకు వెళ్లే వారు కుటుంబ సభ్యులతో తలో పనిచేస్తూ ఉమ్మడి కుటుంబాల యొక్క ఆప్యాయత అనురాగాలు తమ పిల్లలకు పంచుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు.
ఆ విధంగా కుటుంబమంతా ఒకే నాయకత్వంలో కలిసి మెలిసి పనిచేసి వ్వవసాయం చేసి చాల గొప్పగా బతికారు. అదే విధంగా ఆ పల్లెలోని అన్ని కుటుంబాలు అన్ని కలిసి ఒకే కుటుంబంగా మెలిగేవి. ఎవరికి ఏ కష్టం కలిగినా ఊరంతా కలిసి అండగా ఉండేవారు. కానీ..ఇప్పుడు..ఉమ్మడి కుటుంబం మచ్చుకైనా లేదు. దాంతోఐకమత్యము, ఆత్మీయత, ప్రేమ, అనురాగము, అనే వాటికి అర్థం లేకుండా పోయింది.
పక్కింట్లో ఏదైనా ఆపద సంబవిస్తే మాట వరసకు పలకరింపులు తప్ప మరే సహాయ సహకారాలు అందించడం లేదు. ఎదుటి వారు కూడా వారి సహాయ సహకారాలను కూడా ఆసించడము లేదు. ఇది కాలాను గుణంగా వస్తున్న మార్పు వస్తున్న మార్పు దీనికి ప్రస్తుతం వర్ని మండలంలోని కోకలదాస్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని శ్యామ్ రావు తండా చెందిన ఓకే కుటుంబం చెందిన నలుగురు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడంతో ఉమ్మడి కుటుంబం యొక్క గొప్పతనాన్ని సమాజానికి చాటుతున్నారు.
తండాకు చెందిన ఘాజీరాం మొత్తం కుటుంబ సభ్యులు 25 మంది ఉండగా అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బర్దాల్ గాజిరం కుమార్తె బర్ధాల్ రాష్టభాయ్, కుమారులు మహేందర్, రాజేందర్, ఘాజీ రామ్ సోదరుడైన బీరుమల్ కుమారుడు యశ్వంత్ తొలి ప్రయత్నంలోనే నలుగురు ఉద్యోగాలు సాధించడంతో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేస్తున్నారు. వీరికి కామారెడ్డిలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తారా సింగ్ ప్రోత్సాహంతో తాము ఉద్యోగాలు సాధించినట్లు వారు తెలిపారు. ఏది ఏమైనా ఉమ్మడి కుటుంబాలలో ఉన్న ఆప్యాయత అనురాగాలు ప్రస్తుతం కరువయ్యాయి.