కామారెడ్డి, అక్టోబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేవునిపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం అల్పాహారం ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ కే. రవి కాంతారావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు.
ప్రభుత్వం పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందజేస్తుందని తెలిపారు. మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఇడ్లీ, పూరి, కిచిడి వంటివి ప్రతిరోజు అందజేయాలని చెప్పారు. విద్యార్థులు ఇష్టపడి చదివి సమాజంలో ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల కోసం వండిన అల్పాహారంను రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.